గతంలో సిద్దూ జొన్నల గడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద విజయం సాదినిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షోగా ఈ సినిమా తెరకెక్కింది.
యూత్ ముఖ్యంగా ఈ సినిమాను తెగ ఆదరించారు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రాబోతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ , సాంగ్, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా టిల్లు స్క్వేర్ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ టీమ్.
లవర్స్ డే రోజు రిలీజ్ అయిన అదే ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. దాంతో పాటే యూత్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
టిల్లు స్క్వేర్ ట్రైలర్‌లోనూ టిల్లు సినిమాలోని యాటిట్యూడ్‌తో.. స్లాంగ్‌తో.. మేనరిజం కనిపించిన సిద్దు జొన్నల గడ్డ.. మరో సారి తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసేలానే ఉన్నారు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా.. ఈ సారి కాస్త హద్దులు దాటి యాక్ట్ చేసిందనే హింట్ వచ్చింది ఈ మూవీ ట్రైలర్‌తో.
అనుమప, సిద్దు మధ్య లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా ఉండడం.. ఆ సీన్స్‌లో ఇద్దరి కెమెస్ట్రీ బాగా వర్కవడం.. ఈ మూవీ ట్రైలర్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది.