TV9 Telugu
OTT లోకి టిల్లుగాడు.. డేట్ ఫిక్స్.! ఇట్స్ అఫీషియల్..
20 April 2024
2024 లో ఇండస్ట్రీలో ఎంటర్టైనర్ అఫ్ ది ఇయర్ గా బాక్స్ ఆఫీస్ వద్ద కడుపుబ్బా నవ్వించిన సినిమా టిల్లు స్క్వేర్.
రిలీజ్ అయిన అతి తక్కువ సమయంలోనే రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది.
125 కోట్ల కలెక్షన్స్‌తో.. సూపర్ డూపర్ హిట్టు కొట్టిన టిల్లుగాడి కోసం ఓటీటీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అందరి ఎదురు చూపుల మధ్య.. అందర్నీ ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయాడు టిల్లు భాయ్.
ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ న్యూస్.. టిల్లు స్వ్కేర్ మూవీ ఏప్రిల్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుందట.
ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా స్ట్రీమింగ్ డేట్ తో సహా అఫీషియల్గా అనౌన్స్ చేసారు నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం.
తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు నెట్‌ఫ్లిక్స్.
ఇక ఎట్టకేలకు టిల్లు స్క్వేర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ రావడంతో మూవీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు..
ఇక్కడ క్లిక్ చెయ్యండి