టిల్లుగాని మరో రికార్డు..

TV9 Telugu

18 April 2024

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తెలుగు రొమాంటిక్ క్రైమ్ కామెడీ సినిమా టిల్లు స్క్వేర్‌.

ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌లపై తెరకెక్కిన చిత్రమిది.

రామ్ మిర్యాల ఈ చిత్రాన్ని సంగీతం అందించారు. ఈ సినిమా పాటలకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లబించింది.

మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా తొలిరోజే ప్రేక్షకుల్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

తొలి రోజు 23.7 కోట్ల భారీ వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. 100 కోట్లు కలెక్ట్ చేసింది.

ఇదిలా ఉంటె మరో ఘనత అందుకున్నాడు టిల్లుగాడు. తాజాగా ఈ సినిమా 125 కోట్ల గ్రాస్‌ మార్క్ ని దాటుకుని దూసుకెళ్తోంది.

పలు ప్రాంతాల్లో ఇంకా కలెక్షన్లు జోరుగా ఉన్నాయని అంటున్నారు మేకర్స్.  సిద్ధు, అనుపమ జోడీకి, డైలాగులకు, మ్యూజిక్‌కి ఫిదా అవుతున్నారు.