టిల్లు... కలెక్షన్లు ఫుల్లు

TV9 Telugu

02 April 2024

డీజే టిల్లుకి సీక్వెల్‌గా తెరకెక్కింది టిల్లు స్క్వయర్‌. విడుదలైన ప్రతిచోటా హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో దుమ్మురేపుతోంది.

ప్రపంచవ్యాప్తంగా టిల్లు ఫ్యాన్స్ టిల్లు స్క్వేర్ సినిమా చూసి ఎంజాయ్‌ చేస్తున్నారని అంటున్నారు మేకర్స్.

టాలీవుడ్ యంగ్ హీరో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన సినిమా ఇది.

తోలిరోజు నుంచే భారీ వసూళ్లతో సూపర్‌డూపర్‌ సక్సెస్‌ టాక్‌తో దూసుకుపోతోంది ఈ సినిమా. ఈ చిత్రం మార్చ్ 29న విడుదలైంది.

దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన సినిమా టిల్లు స్క్వేర్. ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. తొలిరోజే 23.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

పెద్ద సినిమాలకు ధీటుగా టిల్లు 2 దూకుడు చూపిస్తుంది. రెండు రోజుల్లోనే 50 కోట్లకు చేరువైంది ఈ కామెడీ ఎంటర్టైనర్.

మూడు రోజుల్లోనే 60 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. మూడు రోజుల్లోనే టిల్లు స్క్వేర్ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది.

ఇందులో నేహా శెట్టి మరోసారి రాధికగా గెస్ట్ రోల్ లో కనిపించింది. ప్రియాంక జవాల్కర్ కూడా అతిధి పాత్రలో మెప్పించింది.