టిల్లుగాని బాక్స్ ఆఫీస్ బ్యాండ్ బాజా..

TV9 Telugu

05 April 2024

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ సినిమా టిల్లు స్క్వేర్.

మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. దీని రామ్ మిర్యాల సంగీతం అందించారు.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి.

తొలిరోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్నాడు టిల్లుగాడు. మొదటి రోజు 23.7 కోట్లు వసుళ్లు చేసి నయా రికార్డుగా నిలిచింది.

రెండో రోజు కూడా 21.6 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లతో రెండో రోజుల్లో 45.3 కోట్లతో 50 కోట్ల వైపుగా దూసుకుపోయింది.

ఈ చిత్రం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని సెంట్రల్లో 68.1 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది.

నాలుగో రోజు విషయానికి వస్తే.. 78 కోట్లకి చేరువైంది. 5 రోజుల్లో 85 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం.

6 రోజుల్లో 91 కోట్ల గ్రాస్ వసూలు చేసి 100 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధమైంది టిల్లు స్క్వేర్ సినిమా.