టిల్లు 2 సక్సెస్ మీట్.. నరుడి బ్రతుకు నటన గ్లింప్స్..

TV9 Telugu

07 April 2024

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా టిల్లు స్క్వేర్.

తొలిరోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి.

ఇప్పటి వరకు 8 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. మరో 50 కోట్లు వసూళ్లు చేస్తుందని అంచనా.

ఏప్రిల్ 8న ఈ చిత్ర సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తుండగా.. దానికి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు.

టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా మరో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా ఈ సంస్థ నుంచి వస్తుంది. అదే నరుడి బ్రతుకు నటన. ఏప్రిల్ 26న రానుంది.

ఈ చిత్ర షూటింగ్ అంతా కేరళలోనే జరిగింది. అక్కడి ప్రకృతి అందాల నడుమ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శక నిర్మాతలు.

శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదలైంది.