టిల్లును మెచ్చుకున్న హీరోలు.. తంగలాన్‌ గంగమ్మ ఎవరు.?

TV9 Telugu

08 April 2024

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన టిల్లు స్క్వేర్‌ సినిమాను ప్రశంసించారు హీరోలు రామ్‌చరణ్‌, రానా.

సినిమా చాలా బావుందంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. సిద్ధుకి అద్భుతమైన విజయం అందినందుకు గర్వంగా ఉందని అన్నారు రామ్‌చరణ్‌.

హీరో సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మూవీతో అందుకున్న సక్సెస్‌ తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పారు రానా.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న సినిమా వేట్టయాన్‌. అమితాబ్‌, ఫాహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్టు తెలిపారు నిర్మాత సుభాస్కరన్‌. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను టి.జె.జ్ఞానవేల్‌ డైరక్ట్ చేస్తున్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్‌ హీరోగా నటిస్తున్న తమిళ హిస్టారికల్ యాక్షన్ డ్రామా సినిమా తంగలాన్‌.

ఈ సినిమా నుంచి పార్వతి తిరువోతు క్యారక్టర్‌ లుక్‌ రివీల్‌ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో గంగమ్మ అనే మహిళా రైతుగా కనిపిస్తారు పార్వతి.

కోలార్‌ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సినిమాను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్.