అయోధ్య ప్రాణప్రతిష్టకు హాజరైన వారు.. హాజరు కాని వారు.. వీరే.!

TV9 Telugu

23 January 2024

అయోధ్యలో భవ్య రామయ్య నేడు జనవరి 22న కొలువుదీరారు. ప్రధాని మోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

మధ్యాహ్నం 12.20 నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్‌ లగ్నంలో ప్రాణప్రతిష్ఠను 84 సెకన్ల దివ్య ముహూర్తంలో నిర్వహించారు.

దీనికి సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. ఈ ప్రారంభోత్సవంలో పాల్గున్న సెలెబ్రెటీలు ఎవరో తెలుసుకుందాం.

సోమవారం అయోధ్యలో రామ్ చరణ్, చిరంజీవి కలిసి కనిపించారు. వాళ్లతో పాటు పవన్ కళ్యాణ్ కూడా సపరేట్‌గా పాల్గొన్నారు.

అయోధ్య మందిరం వద్ద దిగిన ఫోటోలో చిరంజీవి, రామ్ చరణ్, సురేఖతో పాటు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా ఉన్నారు.

కోలీవుడ్ నుంచి సీనియర్ స్టార్ హీరో రజినీకాంత్ బాల రామ ప్రాణ ప్రతిష్టకి హాజరయ్యారు. కన్నడ నుంచి రిషబ్ శెట్టి సతీసమేతంగా వెళ్లారు.

బాలీవుడ్ సందడి ఎక్కువగా కనిపించింది. రణబీర్ కపూర్, అలియా భట్, కంగనా రనౌత్, అమితాబ్ బచ్చన్ తో పలువురు పాల్గొన్నారు.

అయితే టాలీవడ్ పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, ఎన్టీఆర్ కి ప్రాణ ప్రతిష్ట ఆహ్వానం అందిన కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయారు.