పదహారేళ్ల వయసు.. సిరి సిరి మువ్వ లాంటి చిత్రాల్లో చంద్రమోహన్ తన నటనతో ఆకట్టుకున్నారు. తెలుగులో తనదైన హావభావాలతో ఓ తరం ప్రేక్షకులను థ్రిల్ చేశారు.
శ్రీదేవి, మోహన్‌బాబుతో చంద్రమోహన్ నటించిన పదహారేళ్ల వయసు 1978లో రిలీజై అప్పట్లో ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది.
రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఆ ఫిల్మ్ ను సినీ ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. చక్రవర్తి అందించిన మ్యూజిక్ ఓ పెద్ద హిట్.
కట్టు కథలు చెప్పి నేను కవ్విస్తే, నవ్విస్తే.. బంగారు బాలపిచ్చుక నవ్వాలి పకాపకా.. మళ్లీ మళ్లీ నవ్వాలి పకాపకా అంటూ సాగే సాంగ్‌లో చంద్రమోహన్ తన ట్యాలెంట్ చూపించారు.
కుంటివాడి పాత్రలో హీరో చంద్రమోహన్ ఆ ఫిల్మ్‌లో నటించాడు. ఆనాటి ఫిల్మ్ లవర్స్‌ను ఈ సాంగ్ తెగ ఇంప్రెస్ చేసింది.
అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ.. అందరికీ అందనిది పూచిన కొమ్మ సాంగ్ కూడా చంద్రమోహన్ కెరీర్‌లో ప్రత్యేకమైంది.
సిరి సిరి మువ్వ లో జయపద్రతో చంద్రమోహన్ కీలకపాత్రలో నటించారు. పలకమన్న పలకదు పంచదార చిలక అంటూ చంద్రమోహన్ ఆ పాటలో భావాలను అద్భుతంగా పలికించారు.
సిరి సిరి మువ్వ చిత్రంలో మరో సాంగ్ జమ్ముంది నాదం సాంగ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎవర్‌గ్రీన్ సాంగ్‌గా నిలుస్తుంది. ఆ పాట అప్పట్లో అందరిలో ఫుల్ జోష్ తెప్పించింది.