ఆ నలుగురు హీరోయిన్లు ఈ సెప్టెంబర్‌ని  అసలు మర్చిపోరు..

10 September 2023

ఖుషి సక్సెస్‌ని సూపర్బ్ గా ఎంజాయ్‌ చేస్తున్నారు సమంత. ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ హ్యాపీడేస్‌ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

మయోసైటిస్‌ వల్ల షూటింగులకు కాస్త బ్రేక్‌ తీసుకున్న సమంత, ఖుషి ప్రమోసన్ల విషయంలో మాత్రం ఎక్కడా వెనకడుగువేయలేదు. ఓపిక ఉన్నా, లేకున్నా ప్రమోషన్లు చేశారు.

బాలీవుడ్‌లో నయన్‌ చేసిన ఫస్ట్ సినిమా జవాన్‌ సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది. బారి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

తన అభిమాన నటుడు షారుఖ్‌తో కలిసి నటించే అవకాశం రావడం, ఆ సినిమా క్లిక్‌ కావడం అన్నీ క్షణాల్లో జరిగినట్టుందని అంటున్నారు లేడీ సూపర్‌స్టార్‌.

రీఎంట్రీలో అనుష్క నటించిన సినిమా మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి. ఈ సినిమా సక్సెస్‌ అనుష్కకి ఎంతో కీలకం. అందుకే సెప్టెంబర్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేశారు స్వీటీ.

సినిమా బావుందంటూ ప్రశంసలు అందుతున్నాయి అనుష్కకు. ఇదే జోరుగా మాలీవుడ్‌ డెబ్యూ ఇచ్చేస్తున్నారు స్వీటీ.

అనూహ్యంగా సెప్టెంబర్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్ల లిస్టులో దీపిక పేరు కనిపించింది. జవాన్‌ రిలీజ్‌ అయ్యేవరకు కూడా దీపిక జస్ట్ కొద్ది సేపు మాత్రమే స్క్రీన్‌ మీద కనిపిస్తారని అందరూ అనుకున్నారు.

అయితే సినిమా రిలీజ్‌ అయ్యాక ఆమెకున్న ఇంపార్టెన్స్ తెలిసింది. ఈ ఇయర్‌ స్టార్టింగ్‌లో షారుఖ్‌తో కలిసి ఆల్రెడీ పఠాన్‌ చేశారు. ఇప్పుడు జవాన్‌తోనూ సక్సెస్‌ చూశారు దీపిక.