కార్తీక మాసం.. ఉల్లిపాయ కూడా తినని టాలీవుడ్ స్టార్ హీరో
06 November2025
Basha Shek
శివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం కావడంతో భక్తులంతా ఎంతో నియమ నిష్టలతో పూజలు, వ్రతాలు చేస్తున్నారు.
ముఖ్యంగా కార్తీక మాసం అంటే?మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉంటారు. కనీసం ఉల్లిపాయ వాసన కూడా దరి చేరనివ్వరు.
కేవలం సామాన్యులే కాదు సినిమా సెలబ్రిటీల్లో చాలా మంది కార్తీక మాసం పూజలు చేస్తారు. ఎంతో నిష్టగా ఉంటారు.
మరి మన టాలీవుడ్ లో కూడా అత్యంత భక్తి శ్రద్ద లతో కార్తీక మాసం ఆచరించే స్టార్ హీరో ఒకరున్నారు
అతను మరెవరో కాదు సనాతన ధర్మం పరిరక్షణ కోసం నడుంబిగించిన ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్
కార్తీక మాసం విశిష్టతను పురస్కరించుకుని పవన్ కల్యాణ్ కూరల్లో ఉల్లిపాయ వేసుకోవడం కూడా మానేసారట.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ సహా మిగతా సభ్యులంతా కూడా ఉల్లిపాయ లేని వంటకాలు మాత్రమే తింటున్నారట.
ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.
ఇక్కడ క్లిక్ చేయండి..