ఈ సారి సంక్రాంతికి సినిమాల జాతరే.. తగ్గదేలే అంటున్న మేకర్స్..

09 October 2023

రావడం పక్కా అని సూపర్‌ క్లారిటీ ఇచ్చేశారు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. అప్పటి నుంచి ఘట్టమనేని ఫ్యాన్స్ లో అదో మాదిరి ఇష్టం పెరిగిపోయింది.

ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గట్టు మహేష్ ని ప్రొజెక్ట్ చేయడానికి అన్ని విధాలా ప్లాన్‌ చేసుకుంటున్నారు త్రివిక్రమ్‌. ఈ కాంబోకి ఉన్న హైప్‌ని దృష్టిలో పెట్టుకుని పరుగులు తీస్తోంది టీమ్‌.

సేమ్‌ సంక్రాంతి నేనూ వస్తున్నా చిన్నోడా అంటూ సిగ్నల్‌ ఇచ్చేశారు సైంధవ్‌ హీరో వెంకటేష్‌. ప్రమోషనల్‌ స్టఫ్‌ ఎప్పుడు రివీల్‌ చేసినా, ఫ్యామిలీ ఎలిమెంట్స్ పక్కాగా ఉండేలా చూసుకుంటున్నారు డైరక్టర్‌.

శైలేష్‌ కొలను అంటే జస్ట్ ఫ్యామిలీ ఎలిమెంట్సే కాదు, అంతకు మించిన డిషెస్‌ ఉండాలని రిక్వెస్టులు చేస్తున్నారు విక్టరీ ఫ్యాన్స్.

మీరు బేఫికర్‌గా ఉండండి... మీతో పాటు నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు శైలేష్‌. ఎలాగైనా డెడ్‌లైన్‌ మీట్‌ కావాలనే ప్రెజర్‌ కనిపిస్తోంది శైలేష్‌లో.

మాస్‌ మహరాజ్‌ నెక్స్ట్ ఇయర్‌ ఈగిల్‌తో గేట్లు తీస్తున్నారు.కార్తిక్‌ ఘట్టమనేని డైరక్షన్‌లో తెరకెక్కిన సినిమా ఈగిల్‌. జనవరి 13న రవితేజను బరిలోకి తీసుకొస్తున్నారు కెప్టెన్‌.

ఈ సీజన్‌ మీదే కన్నేశారు నా సామి రంగా అంటూ అక్కినేని నాగార్జున. నాగ్‌ కెరీర్‌లో డిసెంబర్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, జనవరికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.

కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని నా సామి రంగ మూవీతో డైరక్టర్‌గా పరిచయమవుతున్నారు. ఈ మూవీలో నాగ్‌ మాస్‌గా కనిపిస్తూనే, క్లాస్‌ ప్రేక్షకులను మెప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.

అటు హనుమాన్‌తో రావడం పక్కా అని క్లారిటీ ఇస్తున్నారు ప్రశాంత్‌ వర్మ. టీజర్‌ విడుదలైనప్పటి నుంచే సినిమా మీద హోప్స్ పెట్టుకున్నారు హనుమాన్‌ భక్తజనం.