19 April 2025
8 సినిమాలు చేస్తే ఒక్కటే హిట్టు.. ఇప్పుడు ప్రభాస్ సరసన ఛాన్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
సినీరంగంలో హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఒక్క హిట్టు అందుకుని ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.
కెరీర్ మొత్తం 8 సినిమాలు చేస్తే అందులో ఒక్క సినిమా మాత్రమే సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ప్రభాస్, పవన్ కళ్యాణ్ సరసన నటిస్తుంది.
ఈ అమ్మడు మరెవర కాదు.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుని కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్గా మారిన బ్యూటీ నిధి అగర్వాల్.
మున్నా మైఖేల్ సినిమాతో హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో నాగచైతన్యతో సవ్యసాచి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా హిట్ కాలేదు. కానీ తెలుగులో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసింది. దాదాపు 8 సినిమాల్లో నటిస్తే ఒక్క సినిమా హిట్ అయ్యింది.
డబుల్ ఇస్మార్ట్ సినిమాతో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు రెండు పాన్ ఇండియా చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తుంది నిధి అగర్వాల్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. అలాగే పవన్ జోడిగా హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్