30 June 2025
రాజాసాబ్‌లో స్పెషల్ సాంగ్.. ప్రభాస్తో ఆడిపాడేది ఈ అమ్మడే..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇటీవలే కల్కి 2898 ఏడీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించనున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రాజాసాబ్ చిత్రంలో డార్లింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హారర్ కామెడీ డ్రామాగా ఈ మూవీ రాబోతుంది.
ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ ఈ చిత్రంలో నటిస్తున్నవిషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ చిత్రం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుదట.
ఇందుకోసం ఓ పాత బాలీవుడ్ పాటను రీమక్స్ చేయాలని భావిస్తున్నప్పటికీ .. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆ ఆలోచనను విరమించుకున్నారని టాక్.
ఓ కొత్త పాటను ఈ సినిమా కోసం సిధ్ధం చేస్తున్నారట. అయితే ఇందులో ప్రభాస్ సరసన ఆడిపాడేందుకు ఓ బాలీవుడ్ హీరోయిన్ కోసం చూస్తున్నారట.
అయితే ఇప్పుడు ప్రభాస్ సరసన స్పెషల్ సాంగ్ కోసం కల్కి బ్యూటీ దిశా పటానీని ఎంపిక చేయాలని రాజాసాబ్ టీమ్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్