14 November 2024

అందం కోసం హార్మోన్స్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ విమర్శలు.. ఎవరంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

సాధారణంగా సినీరంగంలో హీరోయిన్స్ గురించి ఏదోక న్యూస్ వైరలవుతుంటుంది. ముఖ్యంగా వారి పర్సనల్ లైఫ్ గురించి రూమర్స్ వినిపిస్తుంటాయి

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ హాన్సిక. హిందీలో బాలనటిగా సినీప్రయాణం ఆరంభించి సౌత్‏లో సెటిల్ అయ్యింది. 

అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. 

ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీలో పలు చిత్రాల్లో నటించింది. 

అయితే  హాన్సిక 16 ఏళ్ల వయసులోనే మరింత అందంగా, యంగ్‏గా కనిపించేందుకు హార్మోన్ల ఇంజక్షన్స్ తీసుకుందని నెట్టింట పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. 

ఈ విషయంపై హాన్సిక చాలాసార్లు వివరణ ఇచ్చింది. ఇలాంటి వార్తలు తన తల్లిని ఎంతో బాధపెట్టాయని.. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. 

తన తల్లి పరిస్థితిని చూసి ఎంతో ఏడ్చామని.. ఇలాంటివి తమ కుటుంబసభ్యులు ఎప్పుడు వినలేదని.. ఆ రూమర్స్ తన హృదయాన్ని విచ్ఛిన్నం చేశాయని తెలిపింది. 

2022 డిసెంబర్ 2న తన ప్రియుడు సోహైల్ కతురియాను పెళ్లి చేసుకుంది హాన్సిక. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తిరిగి రీఎంట్రీ ఇస్తుంది. నెట్టింట యాక్టివ్‏గా ఉంటుంది.