15 November 2025

ఇద్దరు కవలల తల్లి.. 50 సెకన్ల నటనకు 5 కోట్ల రెమ్యునరేషన్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అనేక హిట్ చిత్రాలతో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ కొందరు ఇప్పటికీ అదే క్రేజ్ కొనసాగుతున్నారు.

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ దశాబ్దాలుగా సినీరంగంలో టాప్ హీరోయిన్. 40 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

ఆమె మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆమె ఇద్దరు కవలల తల్లి.

అయినప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం వంటి భాషలలో అనేక చిత్రాల్లో నటించింది.

 సినిమాలతోపాటు అటు వాణిజ్య ప్రకటనలలోనూ నటిస్తుంది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నయన్ ఒకరు.

అయితే గతంలో ఓ వాణిజ్య ప్రకటనలో నటించడానికి భారీగానే పారితోషికం తీసుకుందట. కేవలం 50 సెకన్ల యాడ్ కోసం దాదాపు 5 కోట్లు తీసుకుందట. 

ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో నటిస్తుంది.

అలాగే అటు తమిళంలోనూ నటిస్తుంది. గతేడాది బాలీవుడ్ బాద్ షా జోడిగా జవాన్ చిత్రంతో హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.