26 June 2025

5 వేలతో వచ్చి స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ.. 3 నిమిషాలకే 2 కోట్లకు పైగా..

Rajitha Chanti

Pic credit - Instagram

సినీరంగంలో కేవలం హీరోయిన్లుగా కాకుండా స్పెషల్ పాటలతో ఫేమస్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. ఒక్కో పాటకు కోట్లలో డిమాండ్ చేస్తుంటారు. 

కానీ కెరీర్ తొలినాళ్లల్లో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం మొదట్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. 

నటనపై ఆసక్తితో సినిమాల్లో కనిపించాలనే ఆశతో కేవలం రూ.5 వేలతో కెనడా నుంచి ఇండియాకు వచ్చింది. మొదట్లో ఆఫర్స్ కోసం స్టూడియోస్ చుట్టూ తిరిగింది.

కడుపు నింపుకోవడానికి ఒక గుడ్డు, బ్రేడ్ మాత్రమే తినేదట. కానీ ఇప్పుడు కేవలం 3 నిమిషాల పాటకు రూ.2 కోట్లకు పైగా తీసుకుంటుంది. తనే నోరా ఫతేహి. 

బాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. చూడచక్కని రూపం.. అద్భుతమైన ఫిట్నెస్ లుక్ తో ఆకట్టుకుంటుంది. స్టేజ్ పై ఆమె డాన్స్ చేస్తే చూస్తూ ఉండిపోవాల్సిందే. 

ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలోనూ స్పెషల్ సాంగ్ తో రచ్చ చేసింది. హిందీలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ అన్ని సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి. 

ఈ బ్యూటి స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్. ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోలతో కలిసి ఆడిపాడింది. నివేదికల ప్రకారం ఈ అమ్మడి ఆస్తులు రూ.500 కోట్లు ఉన్నాయట. 

ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా గ్లామరస్ ఫోటోలతో మ్యాజిక్ చేస్తుంది.