ఘనంగా తికమకతాండ ఈవెంట్.. 

08 December 2023

ట్విన్స్ హరికృష్ణ, రామకృష్ణ హీరోలుగా వెంకట దర్శకత్వంలో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ లో వస్తున్న సినిమా తికమకతాండ.

రాజన్న లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో బాలనాటిగా చేసిన యాని ఇందులో హీరోయిన్. రేఖ నిరోషా మరో కథానాయపైగా కనిపించనుంది.

తికమకతాండ అనే ఊర్లోని ప్రజలందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కించారు మేకర్స్.

తిరుపతి శ్రీనివాసరావు ఈ చిత్రానికి నిర్మాత. డిసెంబర్ 15న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

విడుదల దగ్గర పడటంతో ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు ఈ మూవీ మేకర్స్.

ఈ సినిమా ఈవెంట్ కి ప్రొడ్యూసర్స్ సి. కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

హీరోలు హరికృష్ణ, రామకృష్ణ హీరోయిన్స్ యాని, రేఖా నిరోషాకి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు ప్రసన్నకుమార్.

ఈ ఈవెంట్ లో మాట్లాడిన ప్రొడ్యూసర్స్ సి. కళ్యాణ్, దామోదర్ ప్రసాద్ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని అన్నారు.