రాఘవ లారెన్స్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇండస్ట్రీలో నటుడిగా, కొరియోగ్రాఫర్ ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుని కెరీర్ లో సక్సెస్ సాధించారు.
హీరోగా లారెన్స్ టించిన చంద్రముఖి2 మరి కొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో నటించి అందరిని అలరించనుంది.
తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ చంద్రముఖి2 సినిమా తో మరో సారి తెలుగు ప్రేక్షకులను కలుస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
తెలుగు ఇండస్ట్రీలో ఇంతమంది ఫ్యాన్స్ పొందటానికి గల కారణం చిరంజీవి అన్నయ్య అని తెలిపారు. చిరంజీవి గారి చూస్తూ డ్యాన్స్ నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు
నన్ను దర్శకుడిగా ఇండస్ట్రీ పరిచయం చేసిన నాగార్జునను మరిచిపోలేనని తెలిపారు రాఘవ లారెన్స్.
చంద్రముఖి2 సినిమా బాక్సాఫీస్ సక్సెస్ సాధించి మంచ రికార్డులుసొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.