29 November 2025
అనుష్క అందం వెనుక సీక్రెట్స్ ఇవే.. ఇవి పాటిస్తే చాలట..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగులో మోస్ట్ క్రేజీ హీరోయిన్ అనుష్క శెట్టి. అందంతోనే కాదు వ్యక్తిత్వంతో కూడా అభిమానులను సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ ఆమె.
చూడగానే ఆక్టటుకున్న అందం.. చెరగని చిరునవ్వు, చిలిపి కళ్లతో మాయ చేసే స్వీటీకి సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు.
సినిమాల్లో ఎలా కనిపించినప్పటికీ బయట మాత్రం సహజంగా ఉండేందుకు ఇష్టపడుతుంది అనుష్క. ఇంతకీ స్వీటీ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో మీకు తెలుసా.. ?
44 ఏళ్ల వయసులో ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది. వయసు పెరిగినప్పటికీ అనుష్క అందం తగ్గడం లేదు. అందుకు గల కారణాలు ఇవేనట.
రోజుకు ఆరు లీటర్ల నీళ్లు తాగుతుందట. దీంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. రక్త ప్రసరణ పెంచుతుంది. అధిక బరువును నియంత్రిస్తుంది.
అలాగే తన జుట్టు కోసం అనుష్క నిత్యం ఆలివ్ ఆయిల్, ఆముదం, ఆవ నూనెతో తలను మర్దన చేస్తుంది. దీంతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని అంటుంది.
శరీరానికి రసాయనిక ఉత్పత్తులను అస్సలు ఉపయోగించదు. స్కిన్ కేర్ కోసం ఇంట్లోనే సహజమైన పద్ధతుల్లో స్కిన్ కేర్ ప్యాక్స్‌ను తయారు చేసుకుంటుందట స్వీటీ.
ఫిట్ గా ఉండేందుకు నిత్యం గంటలపాటు యోగా చేస్తుంది. అలాగే అనేక రకాల వ్యాయామాలు చేస్తుందట. కూరగాయలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకుంటుందట.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్