రీ రిలీజ్ లో అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఇవే
Phani CH
18 AUG 2024
గత కొంత కాలంగా తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. అయితే ఆ మధ్య ఈ ట్రెండ్ కు కాస్త బ్రేక్ ఇచ్చారు ప్రేక్షకులు.
అయితే తాజాగా రీ రిలీజైన ‘మురారి’ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తెలుగులో రీ రిలీజ్ లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల గురించి తెలుసుకుందాం.
మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మురారి రీ రిలీజ్ లో మొత్తంగా రూ. 8.52 కోట్ల గ్రాస్ వసూల్లతో టాప్ ప్లేస్ ఉంది.
పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరో, హీరోయిన్లుగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ రీ రిలీజ్ లో మొత్తంగా రూ. 7.46 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ లో రూ. 5.85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి టాప్ 3లో నిలిచింది.
ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సింహాద్రి’ రీ రిలీజ్ లో రూ. 4.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి టాప్ 4లో నిలిచింది.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’ రీ రిలీజ్ లో రూ.3.52 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.