టాలీవుడ్‌లో సొంత మ‌ర‌ద‌ళ్ల‌నే పెళ్లాడిన హీరోలు

TV9 Telugu

09 JULY 2024

పెద్ద సంబంధాలు వచ్చినా వారి సొంత మరదళ్లనే పెళ్లి చేసుకొని జీవితాన్ని ఆస్వాదించిన ఈ టాప్ హీరోలు ఎవరో మనం ఇప్పుడు చూద్దాం..

ఏఎన్ఆర్ పెద్ద సంబంధాలు వచ్చిన వాటన్నింటిని పక్కన పెట్టి తన సొంత మరదలు అయిన అన్నపూర్ణను 1949లో పెళ్లి చేసుకున్నారు.

తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఎన్టీఆర్ తన సొంత మరదలు అయిన బసవతారకంను వివాహం చేసుకున్నారు. అప్పటికి ఎన్టీఆర్ సినిమాల్లోకి రాలేదు.

కృష్ణ కూడా తన సొంత మరదలైన ఇందిరా దేవిని 1961 లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్లకు తను హీరోగా మొదటి సినిమా విడుదలైంది.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా అలనాటి సీనియర్ హీరోల మాదిరిగానే తన సొంత మరదలు అయిన విద్యాదేవిని వివాహం చేసుకున్నారు.

సాయికుమార్ వారసుడైన ఆది 2014లో తన మేనమామ కూతురైన అరుణను వివాహమాడారు.  అండర్ 19 క్రికెట్ ఆడిన ఆది తర్వాత సినిమాల్లోకి వచ్చారు. 

ఇక కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్య తమ్ముడు కార్తీ కూడా తన సొంత మరదలు అయిన రజిని పెళ్లి చేసుకున్నాడు.