హరిహర వీరమల్లు మళ్లీ  మొదలు..

TV9 Telugu

21 May 2024

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తెలుగు పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం హరిహర వీరమల్లు.

క్రిష్ జాగర్లమూడి కథ అందించిన, ఈ సినిమాకి క్రిష్ తో పాటు A. M. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ యాక్షన్ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు, A. M. రత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పవన్ సరసన నిధి అగర్వాల్ ఈ సినిమాలో కథానాయకిగా నటిస్తుంది. ఎం. ఎం. కీరవాణి దీని సంగీతం అందిస్తున్నారు.

రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ డిస్ట్రబ్యూట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ కి చాలసార్లు బ్రేక్ పడింది.

దీంతో ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తైంది. ఈ మధ్యే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ అప్‌డేట్ వచ్చింది.

జూన్ నాలుగో వారం నుంచి వీరమల్లు షూటింగ్ మొదలు కానుందని.. ఆగస్ట్ నుంచి పవన్ డేట్స్ కేటాయించారని ప్రచారం జరుగుతుంది.