Naveen Polishetty

బజ్‌ లేని సినిమాతో బ్రహ్మాండమైన హిట్‌! దటీజ్‌ పొలిశెట్టి టాలెంట్..

11 September 2023

Naveen Polishetty Picture

నవీన్ పొలిశెట్టి! నిన్న మొన్నటి వరకు టాలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ అండర్ రేటెడ్ హీరోగానే కొనసాగారు.

Naveen Polishetty Img

జాతి రత్నాలు ముందు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హిట్టు కొట్టినా.. స్టార్ ఇమేజ్ అందుకోలేక పోయారు.

Naveen Polishetty Photo

కానీ జాతిరత్నాలు సినిమాతో.. తన హ్యామర్‌కున్న పవర్‌ ఏంటో చూపించి అందర్నీ నవ్వించేశారు. కరోనా టైంలోనూ ఇండస్ట్రీ హిట్ కొట్టారు.

ఇక ఇప్పుడు మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో మన ముందుకు వచ్చి.. మరో సారి థియేటర్లు పొలిశెట్టి బ్రహ్మాండమైన బజ్ చేస్తున్నారు.

పాన్ ఇండియన్ యాక్టరస్ అనుష్కనే.. ఏకంగా తన యాక్టింగ్‌తో.. డామినేట్ చేసేసి.. 100కు 200 మార్కులు తన ఖాతాలోవేసుకున్నారు.

'మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాలో వన్‌ మ్యాన్‌ షో చేశారు. తన పర్ఫార్మెన్స్ తో ఈ సినిమాను నిలబెట్టారు.

అదొక్కటే కాదు.. సినిమా రిలీజ్‌కు ముందు.. ప్రమోషన్స్ కూడా అన్నీ తానై చూసుకున్నారు. జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చాలా స్ట్రాంగ్‌గా చేశారు.

ఓ పెద్ద సినిమాకు వచ్చినంత బజ్‌.. 'మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి'కి రానప్పటికీ.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైందంటే రీజన్ అది పొలిశెట్టి పడిన కష్టమే!