మళ్లీ భయపెట్టనున్న ‘ది నన్‌’..

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను భయపెట్టిన హారర్‌ చిత్రం ‘ది నన్‌’.

ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘ది నన్‌ 2’.

మైఖేల్‌ చేవ్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో టైస్సా ఫార్మి సిస్టర్‌ ఇరేనే అనే ముఖ్యపాత్ర పోషిస్తుంది.

తాజా ఈ చిత్రం ట్రైలర్‌ను  విడుదల చేశారు మూవీ మేకర్స్.

‘ఈ పాఠశాలలో ఏదో జరుగుతోంది. తప్పు జరుగుతున్నట్టు అనిపిస్తుంది’ అంటూ ట్రైలర్‌ మొదలైంది.

ఈ ట్రైలర్‌తో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ చిత్రం సెప్టెంబరు 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

జేమ్స్‌ వాన్‌, పీటర్‌ సాఫ్రన్‌, జూడ్సన్‌ స్కాట్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.