తంగలాన్ బర్త్ డే గిఫ్ట్..
TV9 Telugu
18 April 2024
కోలీవుడ్ స్టార్ విక్రమ్ హీరోగా పా.రంజిత్ తెరకెక్కిస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా సినిమా తంగలాన్.
జియో స్టూడియోస్, స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్‌పై జ్యోతి దేశ్‌పాండే, కె. ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో విక్రమ్ సరసన మాళవిక మోహనన్ కథానాయకిగా నటిస్తున్నారు. G. V. ప్రకాష్ కుమార్ దీనికి సంగీత దర్శకుడు.
ఇందులో పశుపతి, పార్వతి తిరువోతు, డేనియల్ కాల్టాగిరోన్, హరికృష్ణన్ అన్బుదురై కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారతదేశంలో బ్రిటీష్ పాలనలో తంగలన్ అనే గిరిజన నాయకుడు భూమి కోసం చేసిన పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతుంది.
బంగారు గనుల కోసం అతని భూమిని స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నిన బ్రిటీష్ వారిపై వీర పోరాటం సాగించాడు. అదే ఈ చిత్రం కథ.
తాజాగా బుధవారం విక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు మూవీ మేకర్స్.
ఈ సినిమా కోసం విక్రమ్ పడ్డ కష్టాన్ని ఈ గ్లింప్స్ లో చూపించారు దర్శకనిర్మాతలు. దీని విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి