TV9 Telugu
ఓదెలలో తమన్నా.. ఆ బయోపిక్‌లో రానా..
03 March 2024
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ఓదెల రైల్వే స్టేషన్ ఆహా వేదికగా ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించింది.
ఇప్పుడు దాని సీక్వెల్‌కి రంగం సిద్ధమైంది. ఓదెల 2 అనే టైటిల్‌తో, ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు.
కాశీలో ఓదెల 2 చిత్రీకరణ ప్రారంభం కాగా.. తమన్నా భాటియా ఇందులో నటిస్తున్నారు. సంపత్ నంది కథ అందిస్తున్నారు.
విశ్వక్ సేన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గామి.
తాజా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు. ఇందులో ప్రభాస్ కూడా భాగం కావడం విశేషం. మార్చి 8న శివరాత్రి సందర్భంగా విడుదల కానుంది.
రానా దగ్గుబాటి కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగానే ఉన్నారు. మంచి పాత్రలు వస్తే చేస్తానంటున్నారు ఈ హీరో.
ఈ క్రమంలోనే రానా ప్రతిష్టాత్మక బాక్సింగ్ లెజెండ్ మహమ్మద్ అలీ బయోపిక్‌లో భాగం కానున్నట్లు తెలుస్తుంది.
రానా తరుచూ కల్కి టీంతో కలిసి ఈవెంట్స్ వెళ్లడం, ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఇందులో ఆయన నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి