పాలలో తెలుపు అంతా ఈమెలోనే దాచుకుందేమో.. చీరలో ఆహా అనిపిస్తున్న మిల్కి బ్యూటీ..

30 October 2023

21 డిసెంబర్ 1989న మహారాష్ట్ర రాజధాని బొంబాయి (ప్రస్తుతం ముంబై)లో జన్మించింది వయ్యారి భామ తమన్నా భాటియా

ఈ ముద్దుగుమ్మ తల్లి పేరు రజనీ భాటియా, తండ్రి పేరు సంతోష్. ఈ బ్యూటీకి ఆనంద్ భాటియా అనే అన్నయ్య కూడా ఉన్నాడు.

ముంబైలోని మానెక్‌జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసింది అందాల భామ తమన్నా.

13 ఏళ్ల వయస్సులో నటన నేర్చుకోవడం ప్రారంభించింది. ఒక సంవత్సరం పాటు పృథ్వీ థియేటర్‌లో స్టేజ్ ప్రదర్శనలలో పాల్గొంది.

2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ చిత్రంతో హీరోయిన్ గా బాలీవుడ్ ద్వారా సినీ అరంగేట్రం చేసింది ఈ అందాల భామ.

అదే ఏడాది మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన శ్రీ అనే తెలుగు చిత్రంలో కథానాయకిగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది.

2007లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫీల్ గుడ్ చిత్రం హ్యాపీ డేస్ లో హీరోయిన్ గా ఆకట్టుకుంది. ఆమెకు ఇది తొలి హిట్.

ఈ చిత్రం తరువాత వరుస సినిమా అవకాశాలతో బ్లాక్ బస్టర్స్ అందుకొని తెలుగులో స్టార్ కథానాయకిగా ఎదిగింది ఈ వయ్యారి.