విడుదలకు ముందే విజయ్ లియో భారీ రికార్డ్..

దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లియో.

ఈ చిత్రాన్ని లోకేష్ కానగరాజ్ తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త కోలీవుడ్ లో తెగ వినిపిస్తోంది.

ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా రూ.400 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం.

విడుదలకు ముందే వసూళ్ల పరంగా ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసిందని తెలుస్తోంది.

కాగా శాటిలైట్ డిజిటల్ అండ్ మ్యూజిక్ రైట్స్ దాదాపుగా రూ.220 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం.