మరో సినిమాకు విజయ్ గ్రీన్ సిగ్నల్.. ఫైటర్ కలెక్షన్స్..
TV9 Telugu
28 January 2024
లోకి యూనివర్స్ లో భాగంగా చేసిన లియో సినిమా తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి మామూలు స్పీడ్ చూపించడం లేదు.
గతేడాది వారసుడు, లియో సినిమాలతో వచ్చిన ఈయన.. ఈ ఏడాది వెంకట్ ప్రభుతో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా చేస్తున్నారు.
ఇది సమ్మర్ తర్వాత విడుదల కానుంది. ఇది సెట్స్‌పై ఉండగానే తాజాగా కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమాకు సైన్ చేసారు.
ఈ చిత్ర షూటింగ్ జులై తర్వాత మొదలు కానుంది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
హృతిక్ రోషన్, దీపిక పదుకొనే జంటగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఫైటర్.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి అబౌ యావరేజ్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా అలాగే వస్తున్నాయి.
గురువారం విడుదలైన ఈ సినిమా100 కోట్ల ఓపెనింగ్ టచ్ అవుతుందని ట్రేడ్ అంచనా వేసినా.. 40 కోట్ల దగ్గరే ఆగిపోయింది.
అయితే వీకెండ్ క్యాష్ చేసుకుంటే మాత్రం ఫైటర్ భారీ వసూళ్ల వైపు పరుగులు పెట్టడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి