రజినీతో చేస్తున్న సినిమాపై లోకేష్ కీలక ప్రకటన.. మా ఊరి పొలిమేర 2 అప్డేట్..

15 October 2023

కోవిడ్ సమయంలో ఓటిటిలో వచ్చి ఆకట్టుకున్న సినిమా మా ఊరి పొలిమేర. సత్యం రాజేష్ హీరోగా బాలాదిత్య, గెటప్ శ్రీను తదితరులు నటించరు.

ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తుంది. ఈ సీక్వెల్ ట్రైలర్ విడుదలైంది. చేతబడి బ్యాక్ డ్రాప్‌లోనే వస్తుంది పొలిమేర 2.

విక్రాంత్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'స్పార్క్ L.I.F.E'. ఇదొక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం.

ఇందులో మెహరీన్ కౌర్ పిర్జాదా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు మూవీ మేకర్స్.

రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే వస్తుందనుకుంటారంతా.

కానీ అది LCUలో భాగం కాదని తేల్చేసారు దర్శకుడు లోకేష్. సపరేట్ కథతో రజినీ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఓ మై గాడ్ 2 మూవీ డిజిటల్‌లోనూ సెన్సార్డ్ వర్షన్‌నే రిలీజ్ చేసింది చిత్రయూనిట్‌. స్వయంగా అక్షయ్‌ కుమారే ఈ నిర్ణయం తీసుకున్నారు.

సెన్సార్ బోర్డ్‌కు గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అక్కి ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా వెల్లడించారు మూవీ మేకర్స్‌.