23 September 2023

చూస్తే దిమ్మతిరగాల్సిందే.! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న స్టార్స్ ఫోటోలు

పాన్ ఇండియా రీచ్‌తో.. ఇక్కడున్న ఫ్యాన్ బేస్‌తో..  TFI హీరోలకు సోషల్ మీడియాలో విపరీతమైన రీచ్‌ వచ్చింది.

దానికితోడు.. మన స్టార్ హీరోల హార్డ్ కోర్‌ అభిమానులు తమ క్రియేటివిటీనీ వాడుతూ.. తమ అభిమాన హీరోలను నెట్టింట వేరే లెవల్‌కు తీసుకెళుతున్నారు.

అందుబాటులోకి వచ్చిన కొత్త టెక్నాలిజీని.. అందివచ్చిన నయా టూల్స్‌ను ఉపయోగిస్తూ.. తమ హీరోలను కొత్తగా తీర్చిదిద్దుతున్నారు.

ఇక ఆక్రమంలోనే చాలా మంది ఫ్యాన్స్, AI టూల్స్‌తో.. వారి వారి హీరోల ఇల్యూషన్‌డిఫ్యూజన్ ఫోటోలను క్రియేట్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

వారి నెక్ట్స్‌ సినిమా.. థీమ్‌కు అనుగుణంగా.. హీరోల ఫోటోలను రకరకాల బ్యాక్‌గ్రౌండ్ ఫోటోలతో ఇల్యూషన్ చేస్తున్నారు.

AI ఇల్యూషన్ టూల్‌ను ఉపయోగించి.. ఇవ్వడిమువ్వడిగా.. తమ అభిమాన హీరోల ఫోటోలను ఇల్యూషన్ ఫోటోలుగా మారుస్తున్నారు.

అలా వారు డిజైన్‌ చేసిన ఫోటోలను నెట్టింట విపరీతంగా షేర్ చేస్తూ.. పోటీ పడి మరీ.. ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. 

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మొదలైన ఈ ఇల్యూషన్‌ ఫోటో ట్రెండ్ .. తాజాగా అందరి హీరోలకు పాకింది

పవన్‌, ప్రభాస్, NTR, రామ్ చరణ్‌, అల్లు అర్జున్, మహేష్‌ ఫోటోలు ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తరచిచూస్తే కానీ.. కనిపించకుండా తికమకపెడుతున్నాయి.