ఈ ఏడాది రానున్న తెలుగు పాన్ ఇండియా చిత్రాలు..

TV9 Telugu

22 March 2024

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'.ఇది మే 9న రానుంది. అయితే పోస్టుపోన్ కానున్నట్లు సమాచారం.

బన్నీ హీరోగా చేస్తున్న 'పుష్ప' సీక్వెల్ 'పుష్ప 2 ది రైజ్'. ఈ చిత్రం స్వతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదల కానుంది.

దీనికి నెల రోజుల గ్యాప్ లోనే పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా చిత్రం 'ఓజి' రానుంది. ఇది సెప్టెంబర్ 27న ప్రేక్షకులను అలరించనుంది.

తర్వాత అక్టోబర్ 10న దసరా పండగ సందర్భంగా ఎన్టీఆర్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర పార్ట్ 1' థియేటర్స్ లో సందడి చేయనుంది.

అక్కినేని నాగ చైతన్య తొలి పాన్ ఇండియా సినిమా 'తండేల్'. ఇది కూడా దసరాకి వస్తున్న సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన లేదు.

అలాగే రామ్ చరణ్, శంకర్ కంబినేషన్ లో వస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ చెంజర్'. ఇది డిసెంబర్ 25న రానుంది.

ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ హారర్ 'రాజాసాబ్'. ఇది కూడా ఈ ఏడాదిలో రానున్నట్లు మేకర్స్ తెలిపారు. డేట్ ఇంకా ప్రకటించలేదు.

ప్రేక్షకులు ఎండగానో ఎదురుస్తున్న మూవీ 'జై హనుమాన్'. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హనుమాన్' కి సీక్వెల్ ఇది. 2025 సంక్రాంతికి రానుంది.