ఫామ్ ఈజ్ టెంపరరీ.. క్లాస్ ఈజ్ పర్మినెంట్ అన్నట్లు బాలీవుడ్ మళ్లీ 2023లో ఫామ్‌లోకి వచ్చేసింది. టాప్ 3 మూవీస్ వాళ్లవే. చాలా ఏళ్ళ తర్వాత సౌత్ కంటే బెటర్‌గా పర్ఫార్మ్ చేసింది నార్త్ ఇండస్ట్రీ.
కొన్నేళ్లుగా సౌత్ దెబ్బకు నార్త్ నరాలు కట్టయ్యాయి. కానీ ఈ ఏడాది పఠాన్, గదర్ 2, జవాన్ లాంటి సినిమాలు మళ్లీ వాళ్లను ట్రాక్ ఎక్కించాయి.
2023 మొదట్లో పఠాన్ 1000 కోట్ల క్లబ్‌లో చేరగా.. ఆ తర్వాత రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, కేరళ స్టోరీ, తూ ఝూటీ మై మక్కర్, ఓ మై గాడ్ 2 విజయం సాధించాయి
గదర్ 2 ఏకంగా 600 కోట్లు వసూలు చేసింది.. జవాన్ మరోసారి 1000 కోట్లు కొల్లగొట్టింది. 2023లో ఇంకా టైగర్ 2, గణపథ్, యానిమల్ లాంటి సినిమాలు రానున్నాయి. ఇవి హిట్టైతే బాలీవుడ్‌కు తిరుగుండదు.
బాలీవుడ్ జోరు ముందు ఈ ఏడాది టాలీవుడ్ సరెండర్ అయిపోయింది. కానీ వచ్చే ఏడాది మాత్రం ఇలా ఉండదు రాసి పెట్టుకోండి అంటున్నారు మన హీరోలు.
ఆ కాన్ఫిడెన్స్‌కు కారణం మన దగ్గరున్న సినిమాలే. 2024లో ప్రభాస్ నుంచి ప్రాజెక్ట్ కేతో పాటు సలార్ 2, మారుతి సినిమాలు రానున్నాయి. ఈ మూడింటి బిజినెస్ రేంజ్ 1500 కోట్లకు పై మాటే.
పుష్ప 2 బిజినెస్ బాలీవుడ్‌లోనే 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న దేవరపై బాలీవుడ్‌లోనూ అంచనాలు బాగానే ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ సైతం హిందీలో హాట్ టాపిక్ అవుతుంది. పవన్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఓజిపై కూడా అంచనాలు బాగా ఉన్నాయి. ఇవన్నీ వర్కవుట్ అయితే.. చేజారిన నెం 1 పరిగెత్తుకుంటూ టాలీవుడ్ దగ్గరికి వచ్చేస్తుంది.