మాయాబజార్:- ఈ సినిమాలో ఎన్టీఆర్, ఎస్వీఆర్ పోటాపోటీ నటనను తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోరు. ఈ సినిమా ఎంఎక్స్ ప్లేయర్ స్ట్రీమ్ అవుతుంది.
దేవదాసు:- ఈ నవలపై ఎన్నో ఇండస్ట్రీల నుండి ఈ సినిమా తీసిన ఏఎన్నార్ నటనకు దక్కిన క్రేజ్ మరెవరికి దక్కలేదు. ఈ సినిమాను యుట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు.
గుండమ్మ కథ: - ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన గుండమ్మ కథ కూడా తెలుగు సినిమా చరిత్రలో చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఈ సినిమాను ప్రైమ్ వీడియో ద్వారా చూడవచ్చు.
శంకరాభరణం:- కే విశ్వనాథ్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ఓ పెద్ద మ్యూజికల్ హిట్. ఈ సినిమాను ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉంది.
సాగర సంగమం:- కమల్ హాసన్, విశ్వనాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడచ్చు.
పాతాళ భైరవి:- ఎన్టీఆర్ నటించిన మరో సూపర్ డూపర్ హిట్ మూవీ పాతాళ భైరవి. ఈ కాలం పిల్లలు కూడా ఈ సినిమాను తప్పక ఇష్టపడతారు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ఖైదీ:- మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అతిపెద్ద హిట్ సినిమా ఖైదీ. ఈ మూవీ కూడా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ముత్యాల ముగ్గు:- ముత్యాల ముగ్గు లో రావు గోపాలరావు డైలాగులు ఇప్పటికీ ఎంతో పాపులర్. ఈ సినిమాను యూట్యూబ్ లో చూడొచ్చు.
అడవి రాముడు:- ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్లో మ్యాజిక్ చేసిన సినిమా అడవి రాముడు. ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.