తమిళ డబ్బింగ్ సినిమాలకు కలిసొస్తున్న టాలీవుడ్.. 

26 October 2023

2023లో తెలుగులో డబ్బింగ్ సినిమాలకు బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా తమిళ సినిమాలకు గోల్డెన్ టైమ్ నడుస్తుంది.

జైలర్ సినిమా ఏకంగా 50 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. రజినీకాంత్ చాలా రోజుల తర్వాత తెలుగులో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు.

మరోవైపు విజయ్ ఈ ఏడాది రెండు విజయాలు అందుకున్నారు. సంక్రాంతికి వారసుడు.. దసరాకు లియోతో హిట్స్ కొట్టేసారు విజయ్.

విజయ్ అయితే తెలుగు మార్కెట్‌తో ఆడుకుంటున్నారు. ఒకప్పుడు ఈయన సినిమాలు వస్తున్న సంగతే ఆడియన్స్ పట్టించుకునే వాళ్లు కాదు.

కానీ అదిరింది నుంచి విజయ్ రేంజ్ పెరిగింది. ఆ తర్వాత సర్కార్, విజిల్, మాస్టర్, వారసుడు.. తాజాగా లియో అన్నీ బ్రేక్ ఈవెన్ అయ్యాయి.

అలాగే సూర్య, విక్రమ్, కార్తి కూడా తమదైన రోజు తెలుగు ఇండస్ట్రీ నుంచే 15 కోట్లకు పైగా వసూలు చేస్తున్నారు.

కానీ బాహుబలి, ట్రిపుల్ ఆర్ మినహాయిస్తే... తమిళంలో భారీ కలెక్షన్స్ తీసుకొచ్చిన తెలుగు సినిమాలేం లేవు.

పుష్ప, ఈగ లాంటి ఒకట్రెండు 20 కోట్ల మార్క్ దాటాయంతే. మన సినిమాల్ని వాళ్లు చూడట్లేదు కానీ మనం మాత్రం వాళ్ల సినిమాలను నెత్తిన పెట్టుకుంటున్నాం.