కళ్లు చెదిరేలా మెరిసిన చందమామ.. కాజల్ నయా ఫొటోస్
Rajeev
16 May 2024
అందాల చందమామ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచితూచి అడుగులేస్తోంది. సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తుంది.
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాణించింది కాజల్ అగర్వాల్, దాదాపు అందరు హీరోలతో నటించింది.
ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది కాజల్ అగర్వాల్. ఆతర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
కొడుకు పుట్టిన తర్వాత కాజల్ ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ కావాలని చూస్తుంది. ఇటీవలే వరుసగా సినిమాలు చేసింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో నటించింది కాజల్ అగర్వాల్.
అలాగే సత్యభామ అనే సినిమాలోనూ నటించి మెప్పించింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా కాజల్ అగర్వాల్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి