'హనుమాన్' అయోధ్య విరాళం.. నా సామిరంగా సాంగ్..

TV9 Telugu

09 January 2024

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్య రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు.

రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని, సకుటుంబంగా హాజరవుతామని హనుమాన్‌ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో చెప్పారు.

తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్‌ సినిమా ప్రతి టిక్కెట్‌ నుంచి ఐదు రూపాయలను రామ మందిరానికి విరాళంగా పంపుతారని చిరు అన్నారు.

కుటుంబసభ్యులందరూ చూసేలా సైంధవ్‌ని తెరకెక్కించినట్టు తెలిపారు హీరో వెంకటేష్‌. ఆయన నటిస్తున్న 75వ సినిమా సైంధవ్‌.

సంక్రాంతికి విడుదలవుతోంది. తన తొలి చిత్రం నుంచీ విశాఖతో అనుబంధం ఉందని సైంధవ్‌ ఈవెంట్ లో అన్నారు వెంకటేష్‌.

కొత్త తరానికి తగ్గట్టు థ్రిల్లింగ్‌, యాక్షన్‌ అంశాలతో భావోద్వేగాలను కలగలిపి సైంధవ్‌ మూవీ రూపొందించామని చెప్పారు.

నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ తెరకెక్కిస్తున్న సినిమా నా సామిరంగా. షూటింగ్ నాలుగు నెలల్లోనే పూర్తైనప్పట్టికి బాగా వచ్చిందంటున్నారు దర్శక నిర్మాతలు.

తాజాగా ఈ చిత్రం నుంచి దుమ్ము దుకాణం అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. జనవరి 14న విడుదల కానుంది నా సామిరంగా.