TV9 Telugu

హనుమాన్ మరో రికార్డ్.. ఈ రోజుల్లో పెద్ద సంచలనమే.! 25 థియేటర్లలో..

24 April 2024

ఈ ఏడాది సంక్రాంతికి భారీ సినిమాల మధ్య చిన్న సినిమాగా విడుదలై చాల పెద్ద హిట్‌ అందుకుంది హనుమాన్‌ మూవీ.

తాజాగా ఈ మూవీ 100 రోజుల క్లబ్‌లోకి చేరింది. అది కూడా 25 సెంట‌ర్లలో వంద రోజులు ఆడ‌టం అంటే చిన్న విషయం కాదు.

ప్రశాంత్‌వర్మ డైరెక్షన్ లో తేజ స‌జ్జా హీరోగా చిన్న సినిమాగా విడుద‌లై ఏకంగా రూ. 300 కోట్లు రాబ‌ట్టింది.

తాజాగా ఈ మూవీ 25 సెంట‌ర్స్ లో వంద రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా డైరెక్టర్ ఒక ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు.

ఈ అద్భుత‌ ప్రయాణంలో భాగ‌మైన ప్రతి ఒక్కరికీ నా ధ‌న్యవాదాలు, ఈ ఆనందలో మీరు చూపుతున్న ప్రేమ‌తో నా హృద‌యం నిండిపోయింది.

హ‌నుమాన్ సినిమా వంద రోజుల వేడుక‌ల‌ను థియేట‌ర్లలో జ‌రుపుకోవ‌డం నేను జీవితాంతం గుర్తుపెట్టుకొని ఆరాధించే క్షణం.

ఈ రోజుల్లో వంద రోజులు ఒక సినిమా ఆడ‌టం చాలా క‌ష్టంతో కూడుకున్నది. అలాంటిది హ‌నుమాన్‌కు ఈ గౌర‌వం దక్కింది.

మాలో ఇంత‌టి సంతోషానికి కార‌ణ‌మైన ప్రేక్షకుల‌కు ఎప్పటికీ రుణ‌ప‌డి ఉంటాను. అంటూ ప్రశాంత్ వ‌ర్మ ట్వీట్ చేశారు.