TV9 Telugu
హనుమాన్ ఓటిటి నిరీక్షణకు తెర పడింది.. మరికొన్ని గంటల్లో
07 March 2024
అందరి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సూపర్ హీరో హనుమాన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
హనుమాన్ మూవీకి సంబంధించి ఓటిటి రిలీజ్ పై అధికారిక ప్రకటన కూడా సోషల్ మీడియా వేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే.
యంగ్ హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ‘హనుమాన్’.
మన దేశంలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కిన మొట్ట మొదటి సినిమా హనుమాన్.. భారీ పోటీ మధ్య విడుదలైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడీ నిరీక్షణకు తెర పడింది.. హనుమాన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 కొనుగోలు చేసింది.
మహాశివరాత్రి , మహిళా దినోత్సవాల కానుకగా మార్చి 8 నుంచి హనుమాన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది జీ5 ఓటీటీ సంస్థ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి