TV9 Telugu

13 January 2024

అంచనాలను మించిన హనుమాన్.. ఓటిటి లోకి ఎప్పుడంటే.?

ఎన్నో అంచనాల మధ్య రీసెంట్‌గా రిలీజ్ అయిన హనుమాన్ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇండియన్ సూపర్ హీరో హనుమాన్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించారు ప్రశాంత్ వర్మ.

ఈ సినిమాతో డైరెక్టర్‌గా మరో మెట్టు ఎక్కారనే టాక్ కూడా వస్తోంది. అయితే ఈ మూవీ సక్సెస్ టాక్‌తో పాటే మరో న్యూస్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.

అదే ఓటీటీ టాక్. హనుమాన్‌ ఏ ఓటీటీలో స్ట్రీమ్‌ కానుందనే టాక్.

హనుమాన్ మూవీ ఓటీటీ రైట్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఎట్ ప్రజెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

హనుమాన్ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 దక్కించుకుందని అది కూడా ఫ్యాన్సీ రేట్‌కు అనే టాక్‌ ఉంది.

అఫీషియల్ స్ట్రీమింగ్ కూడా.. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ నుంచి 50 రోజుల తర్వాతే జరగనుంది.

అందుకు సంబంధించిన డేట్‌ కూడా తొందర్లో బయటికి రానుంది. 2025లో జై హనుమాన్‌ పేరుతో పార్ట్‌-2 వస్తుందని ప్రకటించారు.