TV9 Telugu

31 January 2024

థియేటర్లల్లో ఇంకా హనుమాన్‌ ప్రభంజనం.! ఓటిటి లో డేట్ ఎప్పుడంటే?

థియేటర్లలో హనుమాన్‌ ప్రభంజనం తగ్గడం లేదు. రిలీజై వారాలు గడుస్తున్నా ఇంకా హౌస్‌ ఫుల్‌ బోర్డులే.

అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే ఈ సినిమా 250 కోట్లను దాటేసి 300 కోట్ల వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది.

అయితే థియేటర్లలో బ్లాక్ బస్టర్‌ టాక్‌ తో దూసుకెళుతోన్న హనుమాన్‌ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 హనుమాన్‌ డిజిటల్ స్ట్రీమింగ్‌ హక్కులను కొనుగోలు చేసింది. 

ఎప్పటిలాగే థియేట్రికల్‌ రిలీజ్‌ నెల రోజుల తర్వాత సినిమాను ఓటీటీలోకి తీసుకొద్దామనుకుంది. అయితే..

ప్రస్తుతం థియేటర్ల వద్ద హనుమాన్‌ దూకుడు ఏ మాత్రం తగ్గకపోవడంతో థియేట్రికల్‌ రిలీజ్ నుంచి 55 రోజుల తర్వాతే..

అంటే మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో హనుమాన్ ఓటీటలోకి స్ట్రీమింగ్‌కు రావచ్చన్నమాట.

అంటే సరిగ్గా శివరాత్ర పండగకు హనుమాన్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్‌ ఉందిని నెట్టింట ఇప్పటికే ఓ టాక్ కూడా ఉంది.