TV9 Telugu

దిమ్మతిరిగేలా చేస్తున్న తేజ సర్జ హనుమాన్ ట్రైలర్.!

20 December 2023

టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో సినిమాలు చేసి ఆతర్వాత హీరోగా మారాడు తేజ సర్జ.

ఆ తర్వాత జాంబీ రెడ్డితో హీరోగా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ హనుమాన్ సినిమా చేస్తున్నాడు.

తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్‌తో.. ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయాడు.

దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటున్నాడు. ప్రశాంత్ వర్మ మొదటి నుంచి ప్రయోగాత్మక సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

ఇక ఇప్పుడు తేజ తో కలిసి హను-మాన్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మొదటి నుంచి ఈ సినిమా పై క్యూరియాసిటీ క్రియేట్ అయ్యేలా చేస్తూ వచ్చారు టీమ్.

ఇక ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్తో ఈ సినిమా పై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.