TV9 Telugu

25 January 2024

నార్త్ లో కలెక్షన్స్‌ కుమ్మేస్తోన్న తేజ సజ్జా హనుమాన్.!

హనుమాన్ సినిమా రిలీజ్‌ అయి ఆల్మోస్ట్ రెండు వారాలవుతున్నా కూడా ఈ సినిమాను చూసేందుకు జనాలు థియేటర్లకు వస్తూనే ఉన్నారు.

కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్ వచ్చేలా చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ నార్త్‌ జనాలు కూడా.. ఇదే పని చేస్తున్నారు.

సర్‌ప్రైజింగ్‌లీ.. వారు కూడా.. ఈ సినిమాకు ఇంకా చూస్తూనే ఉన్నారు. బాలీవుడ్‌ గడ్డపై హనుమాన్‌ మూవీకి నయా హిస్టరీని క్రియేట్ అయ్యేలా చేసేస్తున్నారు.

ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జా చేసిన హనుమాన్. పెద్ద సినిమాల మధ్య రిలీజ్‌ అయిన ఈ చిన్న సినిమా సూపర్ డూపర్ హిట్టైపోయింది.

ఆల్ ఓవర్ వరల్డ్‌ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. పాన్ ఇండియా లెవల్లో ప్రశాంత్ వర్మను అమేజింగ్ డైరెక్టర్‌గా నిలబెట్టేసింది.

ఏకంగా 200 కోట్ల క్లబ్‌లోకి లెగ్గుకూడా ఎట్టేసింది. ఇక ఈక్రమంలోనే బాలీవుడ్‌లో కూడా దూసుకుపోతోంది ఈ సినిమా.

నార్త్‌లో దాదాపు 2.30 కోట్ల కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంది. దీంతో బాలీవుడ్‌ గడ్డపై ఇప్పటివరకు ఈ మూవీ 36.54 కోట్లు వసూళ్లు చేసినట్టు అయింది.

ఇక ఫీట్‌తో బాలీవుడ్‌లో హనుమాన్ హాట్ టాపిక్ కూడా అవుతోంది.