హనుమాన్ నుంచి పాట విడుదల.. బూట్‌కట్ బాలరాజు ప్రీ రిలీజ్ వేడుక..

TV9 Telugu

31 January 2024

తేజ సజ్జ హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తెలుగు సూపర్ హీరో యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా హనుమాన్.

సంక్రాంతి కానుకగా జనవరి 12న చిన్న సినిమాగా విడుదలై ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుంది హనుమాన్ సినిమా.

మూడో వారంలోనూ కూడా ఈ చిత్ర సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 270 కోట్లకు పైగా వసూలు చేసింది హనుమాన్.

తాజాగా ఈ సినిమా నుంచి  పూలమ్మే పిల్లా అంటూ సాగే హీరోయిన్ అమృత అయ్యర్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను విడుదల చేసారు మేకర్స్.

బిగ్‌బాస్‌ ఫేమ్‌ సోహెల్‌, మేఘా లేఖ జంటగా నటిస్తున్న టాలీవుడ్ కామెడీ రొమాంటిక్ సినిమా బూట్‌కట్ బాలరాజు.

సునీల్‌, ఇంద్రజ, సిరి హన్మంత్‌, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనన్య నాగళ్ల, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కూడా ఇందులో కనిపించనున్నారు.

బూట్‌కట్ బాలరాజు చిత్రం పాటలు, ట్రైలర్‌ ఇప్పటికే విడుదలయ్యాయి. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ వేడుకకి చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. సినిమా ఫిబ్రవరి 2న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.