హనుమాన్ నయా రికార్డు.. ఈగల్‌ టికెట్ రేట్లు..

TV9 Telugu

07 February  2024

చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుంది టాలీవుడ్ సూపర్ హీరో చిత్రం హనుమాన్.

యంగ్ హీరో తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటించిన హనుమాన్ చిత్రానికి నాలుగో వారంలోనూ మంచి వసూళ్లే వస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా 25 రోజులకు 300 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా.

దీంతో 2024లో బాలీవుడ్ ఫైటర్ మూవీ తర్వాత 300 కోట్లు వసూలు చేసిన రెండో చిత్రంగా నిలిచింది హనుమాన్ మూవీ.

రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థపర్ జంటగా కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన మాస్ యాక్షన్ సినిమా ఈగల్.

ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టికెట్ రేట్లపై నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

దీనికి 295 రూపాయలు కాకుండా.. 200 రూపాయలతో నార్మల్‌గా రేట్స్ తోనే వెళ్లాలని చూస్తున్నారు ఈగల్ మూవీ మేకర్స్.

దీనివల్ల సినిమాకు ప్రేక్షకుల నుంచి థియేటర్స్ లో మంచి ఓపెనింగ్స్ బాగుంటాయని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.