హనుమాన్ బ్రేకింగ్ కలెక్షన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్..
TV9 Telugu
28 January 2024
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమా విడుదలైన 15 రోజుల తర్వాత కూడా సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి.
హిందీలోనూ ఈ సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తుంది. ఇప్పటి వరకు అక్కడ 45 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం.
ఇదిలా ఉంటే 15 రోజుల్లో 250 కోట్ల మార్క్ అందుకుంది హనుమాన్. 300 కోట్ల వరకు వసూళ్లు వచ్చే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
విడుదలకు ముందు 100 కోట్లు వసూలు చేస్తేనే గొప్ప అనుకున్న వాళ్లకు.. 250 కోట్లతో సమాధానమిచ్చాడు హనుమాన్.
రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ యానిమల్. రష్మిక మందన్న హీరోయిన్.
పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ హిందీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూలు చేసింది.
జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రం ఓటిటిటో విడుదల చేసారు. ఓ ప్రముఖ ఓటిటి సంస్థలో యానిమల్ విడుదలైంది.
నెట్ ఫ్లిక్స్ వేదికగా ఓటిటిలోకి యానిమల్ వచ్చేసింది. ఇప్పుడు అక్కడ కూడా ఈ రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి