ఓవర్సీస్‌లో హనుమాన్ రికార్డు.. విశ్వంభర షూటింగ్‌కు బ్రేక్..

TV9 Telugu

29 January 2024

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ రోజా హీరోగా తెరకెక్కిన టాలీవుడ్ సూపర్ హీరో సినిమా హనుమాన్. అమృత అయ్యర్ హీరోయిన్.

చిన్న సినిమాగా విడుదలై ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుంది హనుమాన్ సినిమా. మూడో వారంలో కూడా ఈ చిత్ర సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇప్పటి వరకు 250 కోట్లకు పైగా వసూలు చేసింది హనుమాన్. ఇదిలా ఉంటే ఓవర్సీస్‌లోనూ 5 మిలియన్ క్రాస్ చేసింది ఈ చిత్రం.

దీంతో రాజమౌళి, ప్రశాంత్ నీల్ తర్వాత ఆ రికార్డ్ అందుకున్న మూడో దర్శకుడిగా ప్రశాంత్ వర్మ చరిత్ర సృష్టించారు.

వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా విశ్వంభర. ఈ చిత్ర షూటింగ్‌కు ప్రస్తుతం చిన్న బ్రేక్ ఇచ్చారు.

ఫిబ్రవరి నుంచి మళ్లీ పట్టాలెక్కనుంది విశ్వంభర. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర పేరు దొరబాబు అని తెలుస్తుంది.

సోషియో ఫాంటసీ అయినప్పటికీ.. ఎంటర్‌టైన్మెంట్‌ పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు ఈ సినిమా దర్శకుడు వశిష్ట.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది క్లారిటీ లేదు.