TV9 Telugu

17 February 2024

హనుమాన్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారా.? ఓటిటి డేట్ వచ్చేసిందోచ్.

మన దేశంలో యంగ్‌ హీరో తేజ సజ్జా, డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హీరో కాన్సెప్ట్‌ చిత్రం హనుమాన్‌.

సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్‌ బ్లాక్‌ బస్టర్ గా  నిలిచింది. నిర్మాతలకు కాసుల పంట పండించింది. 

థియేటర్లలో రిలీజై నెలన్నర రోజులు పూర్తవుతున్నా తేజ సజ్జా హనుమాన్‌ మూవీకి ఇప్పటికీ కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి.

రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

అలాంటివారందరికీ ఓ గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే హనుమాన్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ కి సిద్ధమైనట్టు ఇండస్ట్రీ టాక్.

ప్రముఖ ఓటిటి సంస్థ జీ5 హనుమాన్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

ఈనేపథ్యంలో మార్చి 2 నుంచే హనుమాన్‌ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారని ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది.

కాగా హనుమాన్‌ మూవీ టికెట్ల ధరలపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించారు మేకర్స్‌.ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.