గుంటూరు కారం గురించి ఆ క్రికెటర్ ఏమన్నారో తెలుసా?
TV9 Telugu
21 March 2024
సూపర్ స్టార్ మహేష్‌బాబు కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమా గుంటూరు కారం.
ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. మీనాక్షి చౌదరి సూపర్ స్టార్ మరదలుగా కనిపించింది.
ఈ ఏడాది సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద 200 కోట్లకుపైగా వసూళ్లు చేసింది.
లేటెస్ట్ గా టీమ్ ఇండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ గుంటూరు కరం సినిమా మీద ప్రశంసలు కురిపించారు.
రీసెంట్‌గా మహేష్‌బాబు నటించిన గుంటూరు కారం చూశానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తనకు సినిమా ఎంతో బాగా నచ్చిందని చెప్పారు.
ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉందని అన్నారు. మెయిన్ లీడ్స్ నటన చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు అశ్విన్.
ఎవరైనా చూడకపోతే చూడమని సలహా ఇచ్చారు. ఇందులో హీరోయిన్ శ్రీలీల డ్యాన్సులకు ఎక్స్ ట్రా మార్కులు వేశారు.
అంతే కాదు, మహేష్ చాలా మంచి డ్యాన్సర్ అని చెప్పారు. మహేష్, శ్రీలీల కాంబో పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందని కితాబిచ్చారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి